ఇక ఉంటాం..భాయ్ భాయ్
1 min read

తప్పుగా మాట్లాడింటే క్షమించండి -కౌన్సిల్ కు ఘనంగా వీడ్కోలు..
న్యూస్ నేడు నందికొట్కూరు: ఇక ఉంటాం..ఇక మీ సేవలు చాలు గత ఐదేళ్లలో నందికొట్కూరు పట్టణాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాం మాకు సహకరించిన ప్రతి అధికారికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ మరియు కౌన్సిలర్లు అన్నారు. నందికొట్కూరు పురపాలక కౌన్సిల్ ఈనెల 18వ తేదీతో ముగియనుంది.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో పురపాలక కౌన్సిల్ సమావేశం సోమవారం చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన కమిషనర్ జి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశం ఉ11:20 నుండి 1:15 వరకు జరిగింది.పట్టణ నివేదిక అజెండాను అధికారులు చదివారు.కౌన్సిల్ ఏర్పడిన గత ఐదేళ్లలో పట్టణాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని అంతేకాకుండా అప్పటి ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్,బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే గిత్త జయ సూర్య సహకారంతో పట్టణాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశామని మున్సిపాలిటీ చైర్మెన్ సుధాకర్ రెడ్డి అన్నారు. మున్సిపాల్టీ అధికారుల సహకారంతో తమ వార్డులను అభివృద్ధి చేసుకున్నామనిగత ఐదేళ్లలో మేము ఏమైనా పొరపాటుగా మిమ్మల్ని తప్పుగా మాట్లాడింటే క్షమించాలని వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు అన్నారు.రాబోయే రోజుల్లో అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని వారు అన్నారు.తర్వాత కొందరు కౌన్సిలర్లు లాలు, నాయక్,అబ్దుల్ రావుఫ్, కరిష్మా మాట్లాడుతూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారం వల్లే మేము వార్డుల్లో గెలిచామని అన్నారు.తర్వాత మున్సిపాలిటీ కమిషనర్ ను కౌన్సిల్ సన్మానించడం జరిగింది.కమిషనర్ మరియు అధికారులు చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు వీడ్కోలు పలుకుతూ ఘనంగా సత్కరించారు.


