నూతనంగా కొనుగోలు చేసిన 4 వాహనాలు ప్రారంభించిన మేయర్
1 min read

ఎమ్మెల్యే బడేటి ఆదేశాలతో శానిటేషన్,త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మున్సిపల్ కార్పొరేషన్ నిధులు 40 లక్షల రూపాయలతో నూతనంగా కొలుగోలు చేసిన 4 వాహనాలను నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు సోమవారం సాయంత్రం ప్రారంభించారు.మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో నూతన వాహనాలను ప్రారంభించిన అనంతరం మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగరపాలక సంస్థ
జనరల్ ఫండ్స్ సుమారు 40 లక్షల రూపాయలతో
డి.షిల్టింగ్ చేయడానికి ఇంటర్నల్ రోడ్లలో ఉన్న డ్రైనేజీల్లో మట్టిని తొలగించడానికి సుమారు 27 లక్షల రూపాయలతో జెసిబి,అదేవిధంగా వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని నగర చివర ప్రాంతాల్లో మంచినీటిని సరఫరా చేయడానికి 3 లక్షల 70 వేల రూపాయలతో వాటర్ ట్యాంకర్,పార్కులకు సంబంధించి సుమారు 4 లక్షల రూపాయలతో నూతనం ఆటో, ఇప్పటికే ఉన్న చైన్ జెసిబి పనులు నిమిత్తం వివిధ ప్రాంతాలకు తరలించడానికి 5 లక్షల రూపాయలు అంచనాలతో ట్రాలీ ఒకటి కొనుగోలు చేశామని వాటిని ఈరోజు ప్రారంభించడం జరిగిందని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు.ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ గా నూర్జహాన్ పెదబాబు పాలకవర్గం,కమిషనర్ ఇతర అధికారులు శానిటేషన్ మరియు త్రాగునీటి పై ప్రత్యేక దృష్టి సారించా మన్నారు.శానిటేషన్ సిబ్బందికి అవసరమైన వాహనాలు,పనిముట్లను అవసరం అనుకున్న వెంటనే కొనుగోలు చేసి అందిస్తున్నామన్నారు.ఇప్పటికే నగరపాలక సంస్థలో శానిటేషన్ సంబంధించి 22 ట్రాక్టర్లు,కాంపాక్టర్లు పెద్దవి-3, చిన్నవి-5, జెసిబిలు-2 పనిచేస్తున్నాయన్నారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏ.భాను ప్రతాప్,అదనపు కమిషనర్ డి.శ్రీనివాసరావు,డిప్యూటీ కమిషనర్ బి.శివారెడ్డి ఎం.ఈ ఈ.సురేంద్రబాబు,డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు,కార్పొరేటర్లు గూడూరి ఆదిలక్ష్మి ప్రసాద్,కలవకల్లు సాంబ,బత్తిన విజయకుమార్,దేవరకొండ శ్రీనివాసరావు,పాము శామ్యూల్ ఏ.ఈ సాయి తదితరులు పాల్గొన్నారు.

