NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతన్న క్షేమమే టీడీపీ ప్రభుత్వ ద్యేయం

1 min read

:వై. నాగేశ్వరరావు యాదవ్ డిసిఎంఎస్ చైర్మన్ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలం హనుమంతరాయుని పల్లెలో  రైతన్న మీకోసం కార్యక్రమాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి  ఆదేశాలతో  డీసీఎంస్ చైర్మన్ వై.నాగేశ్వర యాదవ్ ఆధ్వర్యంలో* నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, అధికారులు మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు. వై.నాగేశ్వరరావు యాదవ్ వ్యవసాయ అధికారులు ఇంటింటిని సందర్శించి కరపత్రాలను అందించి రైతన్నలకు మేలు చేసేలా  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  పంచ సూత్రాలను అమలు చేస్తున్నారని,  పంచ సూత్రాలైన నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటలు సాగు చేయడం, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రభుత్వాల మద్దతు… అనే ఐదు అంశాలపై రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా చైతన్యవంతులను చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ఆదేశించారని . వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పట్టు, పాడి రైతులతో పాటు పౌల్ట్రీ, గొర్రెల పెంపకదారులకు కూడా ఈ అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటవుతుందని.. దీని వల్ల భూమి సారం కోల్పోకుండా ఉంటుందని, రైతులు ఏ పంట సాగు చేశారు, వారికి ఎలాంటి సహాయం కావాలనేది నేరుగా తెలుసుకోవడానికి, పంటల సాగులో పురుగు మందుల వినియోగం వల్ల జరిగే నష్టాలను రైతులకు అర్థమయ్యేలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది.రసాయనాలు తక్కువ వినియోగం వల్ల కలిగే లాభాలు, సేంద్రియ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో తెలపడం జరిగింది.సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్‌ప్రాసెసింగ్‌, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాలు రైతులకు అర్థమయ్యేలా తెలియజేశాము. ఈకార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాజేష్, కూటమి నాయకులు గొల్ల రామ్మోహన్ యాదవ్, భాస్కర్ నాయుడు, కోదండరామయ్య, మహేష్ , రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author