త్రాగునీటి పైప్‌లైన్ కోసం రూ.59 లక్షల మంజూరు కోరిన ఎమ్మెల్యే
1 min read

కర్నూలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ – ప్రజల నీటి సమస్యల పరిష్కారానికి కృషి
ఆలూరు న్యూస్ నేడు: కర్నూలు జిల్లాలో ప్రజల ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే వీరపాక్షి, హెబ్బటంనుండి కురుకుంద గ్రామానికి త్రాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి రూ.59 లక్షల గ్రాంట్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూసినే వీరపాక్షి మాట్లాడుతూ, హెబ్బటం మరియు కురుకుంద గ్రామాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పైప్‌లైన్ ఏర్పాటు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని ఆయన స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ ఈ వినతిని సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించి పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

