తలముడిపి’లో అన్నదాత సుఖీభవ కరపత్రాల పంపిణీ
1 min read

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే..
న్యూస్ నేడు మిడుతూరు (నందికొట్కూరు): అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ నగదు వర్తించే విధంగా కృషి చేస్తామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పరిధిలోని తలముడిపి గ్రామంలో మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ మండల సీనియర్ నాయకులు వంగాల శివరామిరెడ్డి ఆధ్వర్యంలోఅన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ రైతుల ఖాతాల్లో నగదు జమ అయిన సందర్భంగా కరపత్రాలను ఇంటింటికి వెళ్లి రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. తర్వాత మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని’తనిఖీ చేశారు. విద్యార్థులతో పాటు నేలపై కూర్చుని ఎమ్మెల్యే భోజనం చేశారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య,మెనూభోజనం అందించాలన పాఠశాల పరిసరాలనుపరిశీలించారు.సురక్షితమైన త్రాగునీరు,పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉన్నాయా అని విద్యార్థులందరికీ సరిపడా బెంచీలు కూర్చునే సదుపాయం ఉందా అని విద్యార్థులను అడిగారు. కోడిగుడ్డు మరియు చిక్కీలు నాణ్యతగా ఉన్నాయా ఉపాధ్యాయుల పనితీరుపై విద్యార్థులను అడిగారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,ఏడిఏ గిరీష్,ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు, ఏవో పీరు నాయక్,ఎంఈఓ మల్లికార్జున నాయక్,నాయకులు రమణారెడ్డి,మాజీ సర్పంచ్ రామస్వామి రెడ్డి,రామేశ్వర్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

