NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిద్ధార్థ రెడ్డి సహకారంతో చలివేంద్రం ఏర్పాటు..

1 min read

న్యూస్ నేడు నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ లో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో పట్టణ అధ్యక్షులు మన్సూర్, బుల్లెద్దుల ఏసన్న ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం మారుతి నగర్ లో వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి నెల మధ్యలోనే ఎండలు తీవ్రంగా ఉన్నందున వివిధ కాలనీల ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని వారు అన్నారు. చలివేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు అదేవిధంగా చలివేంద్రం ఏర్పాటు చేయడంపై కాలనీల ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్జీ,డేవిడ్, చరణ్ తేజ,మార్కెట్ రాజు,రవి,నాగరాజు,రబ్బానీ, మిన్నల్లా,రఫీ,రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author