రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పుల్లయ్య మృతి
1 min read

నివాళులు అర్పించిన మాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ..
న్యూస్ నేడు నందికొట్కూరు: రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్బెజ్జం పుల్లయ్య కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఆయన చేసిన సేవలు అమోఘమనిమాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ,ఉమ్మడి కర్నూలు జిల్లా చైర్మన్ కాసారపు వెంకటేష్ అన్నారు. ఆయన మరణంతీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేద ప్రజలకు, ఉద్యోగులకు తీరని లోటుగా మిగిలిందన్నారు.అయన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్,డిఆర్ఓగా కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో సేవలు అందించడంతో పాటు,ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కర్నూలు జిల్లాలో విశిష్ట సేవలు అందించారని కాసారపు వెంకటేష్ అన్నారు.ఇలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ముందుగా కర్నూలుతిరుమలగిరి టౌన్షిప్ వారి స్వగృహంలో ఉన్న భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాధవకృష్ణ,నెత్తి కొప్పుల నవీన్,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

