NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి నారా లోకేష్ ను కలిసిన బిషప్ లు

1 min read

కర్నూలు బిషప్ గోరంట్ల జ్వాన్నేష్..

న్యూస్ నేడు నందికొట్కూరు: కర్నూలు మేత్రాసన అభివృద్ధిలో నేనూ భాగస్వామిని అవుతానని రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.అమరావతిలో సాయంత్రం రాష్ట్రంలోని  ఆర్.సీఎం బిషప్ లు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.కలిసిన వారిలోకర్నూలు బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ తండ్రి ,కడప బిషప్ సగినాల పాల్ ప్రకాష్,ఖమ్మం బిషప్ సగిలి ప్రకాష్, ఏలూరు బిషప్ పొలిమేర జయరావ్,నెల్లూరు బిషప్ ఎండీ ప్రకాశం తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డయాసిస్ లోని సమస్యలు,చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకు వస్తే సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.డయాసిస్ సమగ్రాభివృద్ధిలో భాగస్వామినవుతానని తెలిపారు.డయాసెస్ లో చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి బిషప్ మంత్రికి వివరించగా మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ కర్నూలు బిషప్ ను మంత్రి అభినందించారు.తర్వాత మంత్రిని బిషప్ లు మరియు గురువులు సన్మానించారు.

About Author