అంగరంగ వైభవంగా రామ్ రాజ్ కాటన్ షోరూం ప్రారంభం
1 min read

షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి
జ్యోతి ప్రజ్వలన చేసిన టేకో బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సాంప్రదాయ దుస్తుల ప్రముఖ వస్త్ర వ్యాపారసంస్థ రామ్ రాజ్ కాటన్ మన ఏలూరులో మొట్ట మొదటి షోరూమ్ను ప్రారంభించింది. స్థానిక పత్తేబాదలో స్వీట్ మ్యాజిక్ ఎదురుగా రామ్ రాజ్ కాటన్ షోరూమ్ ప్రారంభమైంది. ఇది ఏలూరులో రెండవదని నిర్వాహకులు వివరించారు . నూతన వ్యాపార ప్రారంభోత్సవా నికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన టేకోబ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త మడుపల్లి రత్నాకర్ మొదటి కొనుగోలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్ రాజ్ కాటన్షోరూం ఏపీ ఏరియామేనేజర్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 350 షోరూములు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 52 షోరూములు నిర్వహిస్తున్నామని అన్నిచోట్ల ప్రజల ఆదరణ తో బ్రాంచీలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ షోరూమ్ లో పెద్దలకు మహిళలకు, యువతకు, చిన్న పిల్లలకు అన్ని రకాలుగా వస్త్రములు సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. షోరూంప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్తలను, అతిధులను రామ్ రాజ్ కాటన్ వ్యవస్థాపకులు, చైర్మన్ కె.ఆర్ నాగరాజన్ సాదరంగా పుష్పగుచ్చాలు అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, అంబికా సంస్థల ఎండి అంబికా ప్రసాద్, అంబికా రాజా, టిడిపినాయకులు ఆర్.ఎన్.ఆర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

