ఆంధ్ర,తెలంగాణ నుండి మద్యం సరఫరా
1 min read

60 మద్యం బాటిళ్లు..ముగ్గురు అరెస్ట్..
న్యూస్ నేడు నందికొట్కూరు: ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి మద్యం శ్రీశైలానికి సరఫరా అవుతోంది.శ్రీశైలంబందోబస్తులో ఉన్న ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం సీసాలను పట్టుకున్నారు. నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకుశ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.రాముడు ఆధ్వర్యంలో బుధవారం శ్రీశైలం దేవస్థానం పరిసర ప్రాంతాలు కొత్తపేట, మేకలబండ,మాణిక్యమ్మసేల పరిసర ప్రాంతాల్లో దాడులు చేయగా అక్రమ మద్యం తయారీ రవాణాపై చేస్తున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.రెండు రాష్ట్రాలకు చెందిన 60 మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నామనిఅక్రమ మద్యం తయారీ, రవాణా మరియు విక్రయాలను సహించమన్నారు.చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని ఇలాంటి వాటిపై ప్రజలు సమాచారం అందించి సహకరించాలన్నారు.దాడులు చేసిన వారిలో ఆత్మకూరు, ఎక్సైజ్ సీఐ మోహన్ రెడ్డి, ఆళ్లగడ్డ విజయ్ కుమార్, నంద్యాల లక్ష్మణ్ దాస్, కోయిలకుంట్ల ఎస్ఐ సందీప్, కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సీఐ కిషోర్ కుమార్,నందికొట్కూరు,డోన్ ఎస్ఐలు రమేష్,సోమశేఖర్, కర్నూల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి,వీరాస్వామి పాల్గొన్నారు.

