NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వయంగా బస్సు నడిపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

మాట ఇచ్చాం.. నెరవేర్చాం – ఎమ్మెల్యే బోడె ప్రసాద్

పోరంకి, న్యూస్​ నేడు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దానిని నెరవేర్చే దిశగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్పోరంకి నుంచి కంకిపాడు వరకు దివ్యాంగులని ఎక్కించుకొని స్వయంగా బస్సు నడిపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద దివ్యాంగులతో పాటు టిడిపి కృష్ణాజిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, కూటమి నాయకులు ప్రయాణించారుఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతమాట ఇచ్చిన ప్రకారమే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాము దివ్యాంగులు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయవచ్చు దివ్యాంగులకు సహాయంగా వచ్చేవారు 50% రాయితీతో ప్రయాణం చేసే వెసలు బాటు కూటమి ప్రభుత్వం కల్పించిందిపెనమలూరు నియోజకవర్గంలో ఉన్న 3903 దివ్యాంగులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారుఇప్పటికే శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించాము దివ్యాంగులందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారుజిల్లా అధ్యక్షులు గురుమూర్తి మాట్లాడుతూ..దివ్యాంగులకు ఈరోజు శుభదినం రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది దివ్యాంగులు ఉంటే రెండు లక్షల మంది మాత్రమే పాస్ సౌకర్యం వినియోగించుకుంటున్నారు వారి బాధలు తెలిసిన ముఖ్యమంత్రి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు.2014లో 500 ఉన్న పెన్షన్ ను ఈరోజు 6000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ వెల్ఫేర్  అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మరియు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు వెలగపూడి శంకర్ బాబు పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనందప్రసాద్ కంకిపాడు మండల పార్టీ అధ్యక్షులు జడ వెంకటేశ్వరావు  బిసి సెల్ అధ్యక్షులు సంగిపు రంగారావు బీజేపీ నాయకులు ఎలుకలు విజయేంద్ర కరిమకొండ సురేష్ మారు పూడి ధన కోటేశ్వరరావు విగ్నేష్ చౌదరి యార్లగడ్డ సుచిత్ర పాల్గొన్నారు.

About Author