NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మికులకు నెలకు 21 వేల రూ. జీతం ఇవ్వాలి : సిఐటియు డిమాండ్

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా నెలకు 21 వేల జీతం ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం, ప్యాపిలి మండల కార్యదర్శి ఎస్.ఏ.చిన్న రెహమాన్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ (సిఐటియు) యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర యూనియన్ నాయకులు నెట్టేకళ్ అధ్యక్షతన కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు,మరో 20,000 మంది గ్రీన్ అంబాసిడర్లు, 700 మంది ఎన్ఎంఆర్ లు దశాబ్దాల తరబడి గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతకు పాటుపడుతున్నారన్నారు.గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వాలు వీరికి జీతాలు పెంచలేదని ఒకే విధమైన పని చేస్తున్నప్పటికీ రాష్ట్రం అంతటా ఒకే విధమైన జీతం చెల్లించడం లేదని ఒక్కో చోట ఒక్కో విధంగా నెలకు 6000 నుండి 12 వేల రూపాయల లోపు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు రంగస్వామి,వెంకటరెడ్డి,బ్రహ్మయ్య, నాగరాజు,బాలకృష్ణ,కాజా, లక్ష్మీదేవి,సాలమ్మ, ఓబులమ్మ,అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author