మహమ్మద్ ప్రవక్త భోదన లే మార్గదర్శనం
1 min read

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం ఉదయం కర్నూలు బస్టాండ్ దగ్గర ఉన్న ఈద్గా లో జాయింట్ కలెక్టర్ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో సామూహిక ప్రార్థనలలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అనుసరించిన క్రమశిక్షణ , సోదర భావం మరియు పేదలకు సహాయం చేయడం వంటి కార్యక్రమాలు మునుముందు కూడా సాగించాలని , మహమ్మద్ ప్రవక్త బోధనలే మార్గదర్శనమని ముస్లిం సోదరులకు జాయింట్ కలెక్టర్ నూరూల్ ఖమర్ సూచిస్తూ , ఆ లింగణం చేసుకుంటూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు .

