అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
1 min read

సూర్య ఘర్ పథకాన్ని ఎస్సీ,ఎస్టీ బీసీ,మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని హితవు
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) : ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పేర్కొన్నారు. సూర్యఘర్ పథకాన్ని ఎస్సీ,ఎస్టీలు,బి సి, మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలోనే ప్రప్రథమంగా ఏలూరు సత్రంపాడులోని ఎమ్మార్సీ కాలనీ అంబేద్కర్ నగర్ లోని దేవా మోషే ఇంటి పై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి లబ్ధిదారుడు మోషే చేతులు మీదుగా దీన్ని ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకం ప్రజలకు ఎంతో మేలు చేసేదిగా ఉంటున్నాయని పేర్కొన్నారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ గృహాలపై రెండు కిలోవాట్ల సౌకర్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాలను ఉచితంగా అమర్చడం జరుగుతుందని చెప్పారు. దీని ద్వారా 240 యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతుందని, ఈ వర్గాలకు 200 యూనిట్లు వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుందని, సూర్యఘర్ లో ఉత్పత్తి అయ్యే మిగిలిన నలభై యూనిట్ల కరెంటును విద్యుత్ శాఖ తీసుకుని లబ్ధిదారునికి చార్జీలు చెల్లిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,చోడే వెంకటరత్నం, క్లస్టర్ ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, క్లస్టర్ కో-ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు,డివిజన్ ఇంచార్జిలు కొండే రాణి నిర్మల కుమారి,అట్లూరి రామకృష్ణ, డివిజన్ కో-ఇన్చార్జిలు మద్దు ప్రసాద్, కేతినిడి కిషోర్, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు,తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ముళ్ళపూడి అశోక్, వేల్పుల అరుణ,సతీష్, చందు, జనసేన నాయకులు వీరంకి పండు, బిజెపి నాయకులు నడపన భాస్కరరావు,ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ కె.యం అంబేద్కర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్ కుమార్, మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


