ప్రజల దాహార్తిని తీర్చేందుకే ఈ చలివేంద్రం ఏర్పాటు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్రజల దాహార్తిని తీర్చేందుకే గ్రామ పంచాయతీకి వారు ఈ చలివేంద్రం ఏర్పాటు చేశారని ఎంపిడిఓ శ్రీనివాసరావు అన్నారు. ఈసందర్భంగా బుధవారం ప్యాపిలి గ్రామ పంచాయతీ ఆవరణలోని మెయిన్ రోడ్ లో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీడీవో శ్రీనివాసరావు చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించి ప్రజలకు మజీగ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్, డిప్యూటీ ఎంపీడీవో (జిఎస్డబ్ల్యూఎస్), జూనియర్ సహాయకులు మునిస్వామి, నాగార్జున మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


