NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికల్ రీయంబర్స్మెంట్  పెడింగ్ లో ఉన్న బిల్స్ విడుదల చెయాలి

1 min read

జిల్లా ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్

అన్ని బిల్స్ పరిశీలించి చర్యలు తీసుకుంటాం

సూపరిoటెoడెంట్ ఎం.సమాధాన రాజు

ఏలూరుజిల్లా ప్రతినిథి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు. పెన్షనర్లు పోలీసులు కి సంబంధించి వైద్య ఖర్చులు నిమిత్తం ప్రభుత్వం ఉద్యోగ వర్గానికి కొనసాగిస్తున్న మెడికల్ రీయింబర్సుమెంట్ బిల్స్ వందలాది గా ఏలూరు సర్వ జన ఆసుపత్రి సూపురింటెండెంట్ మరియూ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారి పరిధిలో అనేక నెలలు గా పెండింగులో ఉన్న విషయాన్ని ఈరోజు సూపురింటెండెంట్ ఎం. సమాధానరాజు దృష్టికి తీసుకెళ్లిన ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్50,000 రూపాయల వరకు ఉన్న బిల్స్ సూపురింటెండెంట్ పరిధిలో పరిష్కరించి సంబంధిత అధికారులు కి పంపిస్తే ఆయా అధికారులు ట్రెజరీ కి పంపిస్తారని సూపురింటెండెంట్ కి చోడగిరి శ్రీనివాస్ తెలిపారు.సమాధానరాజు ఎన్జీవో నాయకులు తో మాట్లాడుతూ త్వరలోనే అన్ని బిల్స్ పరిశీలించి చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు,ఏలూరు తాలుకా కార్యదర్శి గంటా చంద్రశేఖర్, పోలీసుల అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు,నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు దంపనబోయిన అనూష ,ఎస్తేరు రాణి,పద్మావతి,ఎన్జీవోస్ అసోసియేషన్  పాల్గొన్నారు.

About Author