NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటర్నేషనల్ పర్పుల్ డే సందర్భంగా ఎపిలెప్సీపై అవగాహన కార్యక్రమం

1 min read

– మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు

కర్నూలు, న్యూస్​ నేడు: మార్చి 26, 2026న నిర్వహించే International Purple Day సందర్భంగా Medicover Hospitals Kurnool లో ఎపిలెప్సీ (మూర్ఛ) వ్యాధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఎపిలెప్సీ గురించి సరైన అవగాహన కల్పించడం, అపోహలను తొలగించడం ప్రధాన లక్ష్యంగా చేపట్టారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ Dr Naga Suresh మరియు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ Dr Raghu Nandini పాల్గొని ఎపిలెప్సీ వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స విధానాలపై వివరించారు. ఎపిలెప్సీ ఒక సాధారణ న్యూరోలాజికల్ సమస్యగా ఉండి, సరైన చికిత్సతో పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు.వైద్యులు మాట్లాడుతూ, ఎపిలెప్సీ ఉన్న వ్యక్తులు సాధారణ జీవితం గడపగలరని, సమయానికి మందులు తీసుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా మూర్ఛ దాడులను నియంత్రించవచ్చని వివరించారు. సమాజంలో ఉన్న అపోహలు, భయాలను తొలగించి, రోగులకు మద్దతు ఇవ్వడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ Maheswar Reddy  మాట్లాడుతూ, “ఎపిలెప్సీ వంటి న్యూరోలాజికల్ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం చాలా ముఖ్యమైన విషయం. సరైన సమయంలో గుర్తించి చికిత్స పొందితే ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భయం తగ్గి, నమ్మకం పెరుగుతుంది. మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది” అని తెలిపారు.

About Author