NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలందరికీ సుభిక్షాన్ని అందించిన రామరాజ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

1 min read

అన్ని వర్గాలు అన్ని మతాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ వెల్లడి

నియోజకవర్గంలో సుమారు 450 రామాలయాలకు7500 కెజీ ల బెల్లం దిమ్మల కానుక

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:శ్రీరామ నవమిని పురస్కరించుకుని పానకం నిమిత్తం దెందులూరు నియోజకవర్గంలోని దాదాపు 450పైగా రామాలయాలకు సుమారు 7500 కేజీల బెల్లం దిమ్మెలను కానుకగా  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు.కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనలో ప్రజలు ప్రతి పండగను మరింత ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటున్నారని, మరోవైపు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ తెలిపారు.ఈనెల 27వ తేదీన రానున్న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడు పెదవేగి దెందులూరు ఏలూరు రూరల్ మండలాల పరిధిలో గ్రామ గ్రామాన ఉన్న దాదాపు 450 పైగా రామాలయాలకు శ్రీరామ నవమి పానకం తయారి నిమిత్తం చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కొక్క రామాలయానికి 15 కేజీల బెల్లం దిమ్మను కానుకగా అందించే కార్యక్రమాన్ని పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రారంభించి బెల్లం దిమ్మలను పంపిణీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకుల ద్వారా ఆయా గ్రామాలకు ఈ బెల్లం దిమ్మలను పంపిణీ చేసి రామాలయాలకు అందించనున్నారు. ప్రతి రామాలయానికి ఒక బెల్లం తిన్న తో పాటు ఇతర పెద్ద రామాలయాలకు అవసరం కలిగిన మరిన్ని రామాలయాలకు మరింత అదనంగా కూడా బెల్లం దిమ్మలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా రామాలయాలకు శ్రీరామ నవమి పురస్కరించుకుని బెల్లం దిమ్మలను కానుకగా అందించడం జరుగుతుందని, వాటిలో భాగంగానే ఈ ఏడాది కూడా దాదాపు 7500 కేజీల బెల్లం పంపిణీ చేయిస్తున్నామని తెలిపారు. ఆ రాముల వారి ఆశీస్సులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అలాగే కూటమి ప్రభుత్వం పైన అమరావతి రాజధాని నిర్మాణం పైన పోలవరం ప్రాజెక్టు పైన ప్రజలందరి పైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని, ఈ సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్  గారపాటి రామసీత, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు  బొప్పనసుధ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఉప్పలపాటి రాంప్రసాద్, మండల పార్టీల అధ్యక్షులు ఈడ్పుపుగంటి అనిల్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్,  మరడాని రవి, నంబూరి నాగరాజు, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరు నాని సహా పలువురు సొసైటీల చైర్మన్ లు,  క్లస్టర్ ఇంచార్జిలు యూనిట్ ఇన్చార్జిలు బూత్ కమిటీ కన్వీనర్లతో పాటు పలువురుకుటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author