అమరావతి ఆంధ్రప్రదేశ్ కల
1 min read

అమరావతికి చట్టబద్దత బిల్లును లోక్‌సభ ఆమోదించడం శుభ పరిణామం
రాజధానిగా అమరావతిని ఇక ఎవ్వరూ కదిలించలేరు.. మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస్ నేడు: అమరావతి అనేది కేవలం రాజధాని కాదని.. ఇది ఆంధ్రప్రదేశ్ కల అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతికి చట్టబద్దత బిల్లును లోక్‌సభ ఆమోదించడం శుభ పరిణామం అన్నారు. ఇక రాజధానిగా అమరావతిని ఎవ్వరూ కదిలించలేరన్నారు. ఇది రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషించే రోజు అన్నారు. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్‌తో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి తయారవుతుందన్నారు. వై.ఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. వైసీపీ హయాంలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి విధ్వంసం నుండి వికాసం దిశగా పరుగులు పెడుతోందన్నారు. అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో రూ.58వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రాజధానిలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.

