NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు చేస్తున్నాం:ఎమ్మెల్యే

1 min read

పెనమలూరు, న్యూస్​ నేడు:  నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ కానూరు పరిధిలో రత్నదీప్ నుండి సూపర్ విజ్ కాలేజీ వరకు 37 లక్షల రూపాయలతో రోడ్డు – డ్రైనేజీ నిర్మాణా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్  మాట్లాడుతూ,కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అనుక్షణం కష్టపడుతున్నామని అన్నారు,గడిచిన వైకాపా ప్రభుత్వం అభివృద్ధి వైపు ఆలోచించకుండా నిధులన్నీ దుర్వినియోగపరచిందని,ప్రజలు ఉపయోంచిన నీరు డ్రెయిన్లు లేకపోవడం వలన రోడ్లు మీదకు వచ్చి ప్రజల నడకకు,వాహనాల రవాణాకు అడ్డంకిగా,ఉంటూ,అపరిశుభ్రత వాతావరణానికి మానసికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి,ప్రజల కోసం 37 లక్షల రూపాయల నిధులతో రోడ్డు – డ్రైనేజీ ఏర్పాటు కొరకు శంకుస్థాపన చేశామని,అలాగే మిగిలి ఉన్న రోడ్లు డ్రెయిన్లు కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మరియు కూటమి నాయకులు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

About Author