ఇంటిలో షార్ట్ సర్క్యూట్..50వేల నష్టం
1 min read

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామంలో ఓ ఇంటిలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల 50వేల నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు.గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఓర్సు పుల్లన్న కుటుంబ సభ్యులు గడివేముల మండలం బూజునూరు గ్రామంలో జరుగుతున్న పెళ్లికి బుధవారం వెళ్లారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి బయట కరెంటు షార్ట్ సర్క్యూట్ రావడంతో మంటలు చెల్లరేగి బయట ఉన్న కొట్టం, మంచాలు,బట్టలు తదితర వస్తువులు మంటల్లో కాలిపోయాయి.ఇంటిలో లోపల ఉన్న వస్తువులు కూడా కాలిపోయి ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు.

