NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్పంచ్, వార్డ్ సభ్యులకు ఘన సన్మానం

1 min read

కౌతాళం,న్యూస్ నేడు : కౌతాళం మండల కేంద్రమైన గ్రామంలో సర్పంచ్ , వార్డ్ సభ్యుల పదవి కాలం నేటితో ముగియడంతో ఘనంగా సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ మండల కన్వీనర్ ప్రహ్లాదాచారి, కోఆప్షన్ సభ్యుడు మాబు సాబు, వెంకటరామరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ పాలు దినాకర్‌తో పాటు వార్డ్ సభ్యులందరికీ సన్మానం చేసి, గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు.మండల కన్వీనర్ ప్రహ్లాదాచారి మాట్లాడుతూ, ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సహకారంతో  దేశాయి కుటుంబం తరపున ఎన్నుకోబడిన సర్పంచ్‌లు గత 10 సంవత్సరాలుగా గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని తెలిపారు. సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రతి చిన్న సమస్యను పరిష్కరించామని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవ చేశామని, వచ్చే స్థానిక ఎన్నికల్లో మూడోసారి గెలిచి కౌతాళాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.సర్పంచ్ పాలు దినాకర్ మాట్లాడుతూ, దేశాయ్ కుటుంబానికి కృతజ్ఞత తెలియజేశారు మరియు ఐదు సంవత్సరాలుగా తమకు సహకరించిన కౌతాళం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తు చేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల సహకారం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుజ్జి స్వామి, సక్రి తిక్కయ్య, వడ్డే రాము, సమ్మద్, అవతారం, రామకృష్ణ, వడ్డే ఉసేని, నాగరాజు, వాడు మెంబర్స్  కార్యకర్తలు , ప్రజలుపాల్గొన్నారు.

About Author