నేటి నుండి గ్రామాలకు ప్రత్యేక అధికారులు
1 min read

నిన్నటితో ముగిసిన సర్పంచుల పదవీకాలం..
మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్ నేడు: గ్రామ పంచాయతీలకు నిన్నటి వరకు సర్పంచులు తమ బాధ్యతల నిర్వర్తించారు. నిన్న సాయంత్రంతో ఐదేళ్ల పదవీకాలం ముగిసింది.ఈ రోజు నుండి నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ఉన్న 19 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన జరగనుంది.వివిధ గ్రామ పంచాయతీలకు నియమించిన
ప్రత్యేక అధికారుల వివరాలు
మిడుతూరు,తిమ్మాపురం, బైరాపురం గ్రామాలకు ఎంపీడీవో దశరథ రామయ్యను నియమించారు.
చెరుకుచెర్ల,జలకనూరు, నాగలూటి,పైపాలెం గ్రామాలకు ఈఓఆర్డి సంజన్న,మాసపేటకు ఎంఈఓమల్లికార్జున నాయక్,రోళ్లపాడు,అలగనూరు గ్రామాలకు పశువైద్య అధికారి సాయినాథ్ రెడ్డి,వీపనగండ్ల, సుంకేసుల గ్రామాలకు డిప్యూటీ ఎంపీడీవో సురేష్ కుమార్,తలముడిపి, కడుమూరు గ్రామాలకు తహసిల్దార్ శ్రీనివాసులు, చౌటుకూరు,49 బన్నూరుకు పశువైద్య అధికారి రాజశేఖర్ రెడ్డి,పీరు సాహెబ్ పేట, చింతలపల్లి,దేవనూరు గ్రామాలకు మండల వ్యవసాయ అధికారి పీరు నాయక్ లను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు ఎంపీడీవో గురువారం సాయంత్రం తెలిపారు.

