అమరావతి రాజధాని బిల్లు ఆమోదం సందర్భంగా ఘన వేడుకలు
1 min read

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
మేయర్ ఎస్.కె నూర్జహాన్ పెదబాబు
కార్పొరేషన్ కార్యాలయంలో రంగురంగుల రంగవల్లులతో అలంకరణ
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026కు లోక్సభలో ఆమోదం లభించిన సందర్భంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి బిల్లు కు రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదనన్న నాయకుడని. రైతులకు,రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగo కారంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కి,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.కార్పొరేషన్ కార్యాలయంలో వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి.
నేపథ్యం:లోక్సభలో (ఏప్రిల్ 1, 2026) ఈ బిల్లు వాయిస్ వోట్ ద్వారా ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మార్చి 28న ఏకగ్రీవ తీర్మానం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది అమరావతిని రాష్ట్రం యొక్క ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించడంతో, గతంలోని మూడు రాజధానుల వివాదానికి చట్టపరమైన ముగింపు పలికే అవకాశం ఉంది. బిల్లు ఇప్పుడు రాజ్యసభకు వెళ్లనుంది.ఈ చారిత్రాత్మక పరిణామం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు, వేడుకలు జరుగుతున్నాయి. ఏలూరులో మేయర్ షేక్ నూర్జహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఆ సంతోషానికి ఒక ఉదాహరణగా నిలిచాఇ.ఈ వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను ప్రతిబింబించేలా ఉన్నాయి. అమరావతి అభివృద్ధి మరింత వేగవంతం కావాలని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)సిబ్బంది ఐ లవ్ యు అమరావతి రంగవల్లులతో కొవ్వొత్తులు, ప్రమిద దీపాల అలంకరణతో కొత్త శోభాయనం సంతరించేలా అలంకరించారు. కార్యక్రమంలో కమీషనర్ ఏ భాను ప్రతాప్, మెప్మా పీడీ ఎం రాజా బాబు, సహాయ కమిషనర్, ఎం ఈ రవీంద్రబాబు, అడిషనల్ కమిషనర్ డి శ్రీనివాస్,ఎస్.కె షీరాజ్, కార్పొరేటర్లు పాము శామ్యూల్, దేవరకొండ శ్రీనివాస్, సబ్బన నరసింహారావు మరియు ఆర్వోలు,ఆర్ఐలు,ఏఈలు తదితర కార్యాలయసిబ్బంది పాల్గొన్నారు.


