NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎంఆర్ఎఫ్  చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కె.ఈ శ్యామ్ కుమార్

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:    పత్తికొండ నియోజకవర్గంలోని  పత్తికొండ, మద్దికేర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలకు చెందిన లబ్ధిదారుల కు ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ శుక్రవారం సీఎంఆర్ఎఫ్  చెక్కులు పంపిణీ చేశారు. పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  32 మంది లబ్దిదారులకు 14లక్షల 92 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యే  కే.ఈ.శ్యామ్ కుమార్ , ముఖ్యమంత్రి చంద్రబాబుకు  కి , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి , కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే   మాట్లాడుతూ, కష్టకాలంలో కుటుంబానికి పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని అన్నారు.పేదవాళ్లు అనారోగ్యానికి గురైతేముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసి ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని వారికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తున్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. పత్తికొండ నియోజకవర్గం లోని చెక్కులు తీసుకున్న లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి .సిరిగిరి సుంకన్న రూ.73,554, 2. ఎం జయ కృష్ణమ్మ  రూ.30,5143. తలారి బాలరాజు రూ 40,000 4. బోయ గోపాల్ రూ రూ.25,6555. సంఘాల శ్రీనివాసులు రూ 25,000 6. కురువ టైలర్ సుంకన్న రూ.35,000 7. కుమ్మరి చంద్రన్న రూ.88,8048. గంగసాని అక్షయ రూ.68,6829. కే వర్షిని రూ 6181210. బంగారు అంకప్ప నాయక్ 64,0411. మద్ధినేని శ్రీనివాసులు 47,80012. హరిజన స్వరూప 30,78613. రెడ్డి పోగు నాగరాజు 25,65514. కనకం లక్ష్మీదేవి 32,11415. కే జనార్ధనా చారి 35,000 16. బోయ వెంకటలక్ష్మి 74,000 17. మారినేని రంగమ్మ 32,493.

About Author