ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధతపై హర్షం
1 min read

కర్నూలు , న్యూస్ నేడు: పార్లమెంటు ఉభయ సభల్లో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందటంపై నగరపాలక ఉద్యోగులు హర్షం వ్యక్తం. గురువారం రాత్రి 7 గంటలకు అదనపు కమిషనర్ ఆర్జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్, ఉద్యోగులు కొవ్వొత్తు పట్టుకొని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. అమరావతి చట్టబద్ధంగా ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమని అభివర్ణించారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, సూపరింటెండెంట్లు ఇశ్రాయోలు, రామక్రిష్ణ, సిబ్బంది శ్రీనివాసులు, వీరకుమార్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

