అమరావతికి చట్టబద్ధత పై ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ హర్షం
1 min read

ఐదు కోట్ల ఆంధ్రుల ఆశయాలకు గెలుపు
ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణలు చేస్తూ, అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది అమరావతి ని రాజధాని గా ప్రకటించటం పట్ల ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కార్యదర్శి నెరుసు రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ ఎస్ హరనాధ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని శ్రీనివాస్ కొనియాడాతూరాష్ట్ర అసెంబ్లీ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం ఒక విప్లవాత్మక అడుగు అని పేర్కొన్నారు. దానికి కొనసాగింపుగా ఏప్రిల్ 1, 2 తేదీల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో వెనువెంటనే ఆమోదం లభించడం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు.దీని ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అంకురార్పణ జరిగిందని శ్రీనివాస్ తెలిపారు.రామారావు మాట్లాడుతూఅమరావతి అంటే కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, అది ఐదు కోట్ల ఆంధ్రుల పేదరికం లేని నవ్యాంధ్ర నిర్మాణానికి, రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఒక బలమైన పునాదిని పేర్కొన్నారు .హరనాధ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, వారికి వెన్నంటి నిలిచిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మరియు ఏపీ అభివృద్ధికి పెద్దపీట వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ చారిత్రాత్మక నిర్ణయంతో ఉద్యోగులు,ఉపాధ్యాయులు. కార్మికులు మరియు సామాన్య ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

