అపరిచిత వ్యక్తులతో డిజిటల్ లావాదేవీలు చేయవద్దు
1 min read

ఏటీఎంల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్
కర్నూలు, న్యూస్ నేడు: అపరిచిత వ్యక్తులు, తెలియని వ్యక్తులతో డిజిటల్ లావాదేవీలు చేయవద్దని , ఏటీఎం కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ జిల్లా ప్రజలకు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. అపరిచిత వ్యక్తులతో ఎటిఎంల వద్ద లావాదేవీలు చేయకూడదన్నారు. అత్యవసరం ఉందని ఎవరైనా మీకు డబ్బులు ఇస్తాం , మాకు ఫోన్ పే లేదా గుగూల్ పే చేయండి. లేదా మేము ఫోన్ పే లేదా గుగూల్ పే చేస్తాం. మాకు డబ్బులు ఇవ్వండి అంటే అపరిచిత వ్యక్తులను నమ్మద్దన్నారు. ఎక్కడైనా వాళ్ళు దొంగపని చేసి ఉన్నట్లయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయబడతాయన్నారు. కావున ప్రజలందరూ ఎటిఎంల ద్వారా లేదా బ్యాంకుల ద్వారానే నేరుగా వెళ్ళి లావా దేవీలు జరుపుకోవాలన్నారు. అపరిచితులను నమ్మవద్దన్నారు. తెలియని వ్యక్తులకు ఎటిఎం నుండి డబ్బులు డ్రా చేసి ఇవ్వమని అడగవద్దన్నారు. ఎటిఎం కార్డులు మార్చి అపరిచిత వ్యక్తులు డబ్బులు కొట్టేస్తారన్నారు. ప్రజలు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు: ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల సహాయం తీసుకోవద్దు తెలియని వ్యక్తులతో డిజిటల్ లావాదేవీలు చేయవద్దు. పని చేయని ఎటిఎం ల వద్ద “అత్యవసరం” ఉందంటూ నమ్మించే వ్యక్తులను నమ్మవద్దు. మీ బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరికీ ఇవ్వొద్దు. అనుమానాస్పద వ్యక్తుల పై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
సైబర్ మోసం జరిగితే వెంటనే:1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి. ఒక గంటలోపు ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఇలాంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.

