NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుడ్ ఫ్రైడే ప్రార్థనల్లో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

1 min read

స్వయంగా సిలువ మోసి,క్రీస్తు చూపిన సేవ సన్మార్గాన్ని అందరూ పాటించాలని సందేశం

ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మానవాళి పాప విముక్తి కోసం ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగం అనన్య సామాన్యమని దెందులూరు  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొనియాడారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా పెదవేగి మండలం విజయిరాయ్ గ్రామంలో ఫాదర్ దివాకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు మరియు సిలువ యాత్ర (ర్యాలీ)లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సిలువ మోసిన ఎమ్మెల్యే చింతమనేనిభక్తిశ్రద్ధలతో జరిగిన ఈ సిలువ యాత్రలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా సిలువను తన భుజాలపై మోసి, క్రీస్తు పడిన శ్రమలను స్మరిస్తూ భక్తులతో కలిసి నడిచారు.అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, సేవ అనే మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. శాంతియుత సహజీవనం ద్వారానే అభివృద్ధి సాధ్యమని, నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరి సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.వేసవి ఎండల దృష్ట్యా, ప్రార్థనలకు హాజరైన విశ్వాసులకు మరియు ప్రజలకు ఆయన స్వయంగా శీతల పానీయాలను పంపిణీ చేశారు. అలాగే అక్కడి చిన్నారులకు ఐస్‌క్రీమ్‌లు అందించి వారితో సరదాగా సమయం గడిపారు.అనంతరం విజయరాయి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే చింతమనేని కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫాదర్ దివాకర్ తో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బోప్పన సుధా, క్లస్టర్ ఇంచార్జ్ మంచినేని శ్రీనివాస్ సహా పలువురు స్థానిక కూటమి నేతలు, క్రైస్తవ విశ్వాసులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author