NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళితుల రక్షణకు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి

1 min read

దళితుల సంక్షేమం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి

దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ కూరాకుల బాబురావు

దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు

సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య.

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దళిత హక్కుల పోరాట సమితి జిల్లా స్థాయి సమావేశం ఏలూరు ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవన్ నందు తొర్లపాటి బాబు అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక వివక్షలు ఎదుర్కొన్న దళితులపై నేటికీ దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.దళితులకు రక్షణ కల్పించవలసిన ప్రభుత్వాలు చట్టాలను సవరిస్తూ దళితుల రక్షణను ప్రశ్నార్ధకం చేస్తున్నారని ఆరోపించారు. సామాన్య కార్మికుల నుంచి శాసనసభ్యులు వరకు కుల వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు రక్షణ కల్పించే చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల వలన దేశంలోని ప్రజలు పేదవారు పేదవారిగా డబ్బున్నవారు మరింత ధనవంతులుగా రూపాంతరం చెందుతున్నారని ఆరోపించారు. కేవలం కొద్ది మందికి దేశ సంపదను దోచిపెట్టడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం,రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటుందని ఆరోపించారు. ఇకనైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి విధానాలను మానుకొని పేదరికంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు,సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన దళితుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం 13 మంది సభ్యులతో జిల్లా కన్వీనింగ్ కమిటీనీ,కన్వీనర్ గా కూరాకుల బాబూరావును సమావేశం ఎన్నుకున్నది. ఈ సమావేశంలో గుమ్మడి లక్ష్మీనారాయణ,తాడిగడప జయరాజు, గొలిమే బాల యేసు, పులిపాకుల దుర్గారావు, కొండేటి రాంబాబు, కొల్లూరి సుధారాణి, ఉప్పులూరి లక్ష్మి, భవాని తదితరులు పాల్గొన్నారు.

About Author