65 సంవత్సరాలు పైబడిన న్యాయవాదులు కు పెన్షన్ సౌకర్యం కల్పించాలి
1 min read

ఐ. ఏ. ఎల్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. సురేంద్ర కుమార్
న్యూస్ నేడు పత్తికొండ: 65 సంవత్సరాలు పైబడిన న్యాయవాదులు అందరికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 15 వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఇండియన్ అసోసియేషన్ అఫ్ లాయర్స్ (ఐ. ఏ. ఎల్ ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. సురేంద్ర కుమార్ డిమాండ్ చేసారు.శనివారం పత్తికొండ బారసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వృద్ధాప్యం లో న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనుక పెన్షన్స్ సౌకర్యం కల్పించి వారిని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 14 వేల రూపాయలు ఇస్తున్నదని గుర్తు చేసారు.అదే తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నెలకు 15 వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో వాకాలత్ తగ్గిపోయి మరియు జ్ఞాపకశక్తిని కోల్పోయి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అందుకోసం 65 సంవత్సరాలు పైబడిన ప్రతి న్యాయవాదికి రాష్ట్ర ప్రభుత్వం 15 వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. కొంతమంది తమ కంటి చూపుని కోల్పోయి చదవలేని పరిస్థితిలో కోర్టుకు రావడం మానేసారని తెలిపారు. వృద్ధాప్యంలో తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు . అనారోగ్య కారణాల రీత్యా డబ్బులు లేక సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం 15 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ద్వారా కనీస ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకునే దానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన వారికి పెన్షన్ ఇస్తున్నారని, న్యాయవాదులకు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.

