శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న పద్మశ్రీ గరికపాటి నరసింహారావు
1 min read
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి చందన
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరుజిల్లా,జంగారెడ్డిగూడెం మండలo,గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనార్ధం ప్రముఖ ఆద్యాత్మిక ప్రవచన కర్త పద్మశ్రీ గరికపాటి నరసింహరావు విచ్చేసారు. ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వఃణాధికారిణి, అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినారు. అనంతరం శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు గావించినారు. వీరికి ఆలయ ముఖ మండపo నందు వేద ఆశీర్వచన గావించి తీర్థ ప్రసాదములు అందజేసినారు.

