NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యం

1 min read

పబ్లిక్ గ్రీవెన్స్ ను ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్  నిర్వహించారు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ప్రజల యొక్క సమస్య లను త్వరి తగతిన, పార దర్శ కంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో సోమవారం ప్రజల సమస్యల పరి ష్కార వేదిక’కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్, ఏ ఆర్ అదనపు ఎస్పీ  జి.ముని రాజా తో కలిసి ఫిర్యాదుదారుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమం పూర్తిగా పేపర్ లెస్  పద్ధతిలో పారదర్శ కమైన ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు.మొత్తం 41 ఫిర్యాదు లు అందాయి. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు ఆర్థిక మోసాలకు సం బంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నరు.ఎస్పీ స్వయంగా ఫిర్యాదు దారులతో మాట్లాడి, వారి సమస్యలను విన్నారు. అధికారులు తో జిల్లా ఎస్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ మాటలాడి సదరు ఫిర్యాదులపై చట్ట ప్రకారం తక్షణమే విచారణ చేపట్టి, నివేదికలను సమ ర్పించాలని సంబంధిత అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు.ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా మరిన్ని వెసులుబాటులను ఎస్పీ వివరిం చారు.డబ్బు, సమయం వృథా చేసుకోకుండా నేరుగా సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చనితెలిరు,ఫిర్యాదులు చేయాలనుకునే వారు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చన్నరు. ప్రజలు చేసిన ఫిర్యాదుల స్థితిగతు లను  తెలుసుకోవ డానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసు కోవచ్చన్నరు.పబ్లిక్ గ్రీవెన్స్ కార్య క్రమమునకు వచ్చినా దూర ప్రాంతాల నుండి ఫిర్యాదుల కోసం పోలీస్ కార్యాలయానికి వచ్చిన ప్రజల కోసం శ్రీ సత్య సాయి బాబా ట్రస్ట్ వారు ఉచిత భోజన సదుపాయం కల్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *