NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫ్యాప్టో నే పి ఆర్ సి ఉద్యమానికి నాంది పలికింది

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉపాధ్యాయ సమస్య ల పై ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం మలి దశ పోరాటం కొరకు పిలుపు ను ఇచ్చింది. ఈ పిలుపు లో భాగంగా నేడు కర్నూలు జిల్లా మూల్యాంకన కేంద్రం లో ఫ్యాప్టో నిరసనకు  ముఖ్య అతిథులుగా  ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి హృదయ రాజు హాజరు కావడం జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల ఆర్ధిక సమస్యలు తీరుతాయి అని భావించాం కానీ దీనికి విరుద్ధంగారెండేళ్లు పూర్తి కావస్తున్న ఇంత వరకు పి ఆర్ సి  గురించిన ప్రసక్తి లేదు.2022 నుండి పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులు చెల్లింపు జరగలేదు.కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు తమ నిరసనలు ప్రకటిస్తున్నాయి. గతం లో కూడా ఫ్యాప్టో నే పి ఆర్ సి ఉద్యమం నకు నాంది పలికింది. ఇప్పుడు మరల ఫ్యాప్టో నే ముందడుగు వేసింది  అన్నారు. ఫ్యాప్టో నాయకుల ఆధర్వ్యం లో పది మూల్యాంకన కేంద్రం లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులు నిర్వహించారు. మరియు ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారం కొ మూల యందు నల్ల బ్యాడ్జిల ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమం నకు ఫ్యాప్టో కర్నూలు జిల్లా చైర్మన్ మరియు  ఆప్టా కర్నూలు జిల్లా అధ్యక్షుడు  యం . మధు సూధన రెడ్డి   ఫ్యాప్టో  జనరల్ సెక్రటరీ,  భాస్కర్ అధ్యక్షత వహించారు. అపస్ రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ మరియు జిల్లా నాయకులు నాగ స్వామి సంఘీభావం ప్రకటిస్తూ హాజరు కావడం జరిగింది.యు టీ ఎఫ్ నుండి రవి కుమార్, నవీన్, ఎస్ టి యు నుండి జనార్దన్, ఎ పి టి ఎఫ్ 257 నుండి  రంగన్న, ఎ పి టి ఎఫ్ 1938 నుండి మరియానందం, బి టి ఏ నుండి నందీశ్వరుడు , ఆప్టా నుండి కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ డి. గోపాల్, నాగార్జున డి టి ఎఫ్ నుండి గట్టు తిమ్మప్ప,పి ఇ టి అసోసియేషన్ నుండి లక్ష్మన్న, ప్రధానోపాధ్యాయ సంఘము నుండి ఓంకార్ యాదవ్, తదితరులు పాల్గొనటం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *