తర్తూర్’లో పూజలు నిర్వహించిన ఎంపీ శబరి
1 min read

-సిమెంట్ రోడ్లు మరియు మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని తర్తూరు గ్రామంలో సోమవారం ఉదయం శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో తిరుణాల సందర్భంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ, ఆలయ ఈవో ఏ సాయికుమార్ ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దేవాలయంలో పూజల అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలను ఎంపీ తనిఖీ చేశారు.పాఠశాల శిథిలా వస్థలో ఉందని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే ఎంపీ నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డికి ఫోన్ చేసి పాఠశాల స్థితి గురించి వివరించారు.తర్వాత గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన వంక దగ్గర మరియు బైరెడ్డి కాలనీలో 55 లక్షలతో వేసిన సిమెంట్ రోడ్లను ఎంపీ ప్రారంభించారు.అదే విధంగా గ్రామంలో ఉన్న రెండు అంగన్వాడీ నూతన నిర్మాణ భవనాలకు నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.తర్వాత భాస్కరపురం గ్రామంలో 50 లక్షలతో వేసిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. పాములపాడు మండలం వాడాల గ్రామంలో ఎంపీ నిధులు ఐదు లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ట్యాంకును ఎంపీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దాస్ సుధాకర్ రెడ్డి,నాయకులు తర్తూరు పీఎం నాగిరెడ్డి,శివ కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి నాగేశ్వరరావు,టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,బంగారు వెంకటేశ్వర్లు,గోవింద్ యాదవ్,ప్రతాపరెడ్డి,స్వామి రెడ్డి పాల్గొన్నారు.

