49 బన్నూరు సర్పంచ్ కు సత్కారం..
1 min read

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామ సర్పంచ్ జి. భూదేవిని ఘనంగా సన్మానించారు.మంగళవారం ఉదయం చౌటుకూరు సచివాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వేల్పుల వినయ్ చంద్ర ఆధ్వర్యంలో సర్పంచ్ దంపతులు భూదేవి,పిక్కిలి సాంబశివుడులను శాలువా పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.గత ఐదు సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్ గా గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని సర్పంచ్ పదవీ కాలం ఈనెల 2వ తేదీతో ముగిసినందున సర్పంచ్ దంపతులను సన్మానించినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి సోఫీ సాహెబ్,డిజిటల్ అసిస్టెంట్ శేఖర్,వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రసాద్,విఏఏ మహేష్, వెటర్నరీ అనిత పాల్గొన్నారు.

