ఆరోగ్యం కోసం కలిసికట్టుగా విజ్ఞానానికి అండగా నిలబడదాం
1 min read

ఆరోగ్యమే మహా భాగ్యము
తాడేపల్లి న్యూస్ నేడు: ఏప్రిల్ 7 మంగళవారం గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు లో భాగంగా తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామంలో ఉన్న కిశోర బాలికల గ్రూప్ సభ్యులకు వరల్డ్ హెల్త్ డే గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ తాడేపల్లి మండల కమ్యూనిటీ ఆర్గనైజర్ అత్తోట పోతురాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర సంబంధిత అనుబంధ సంస్థల ప్రాయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అని ఇది మొదట 1948లో,మొదటి ప్రపంచ ఆరోగ్య సభను ఏర్పాటు చేసిందని , అప్పటి నుండి 1950 వ సంవత్సరం నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 ను జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించిందని ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన ప్రాముఖ్యత ఉన్న అంశంపై ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించేటట్లు ఈ సంస్థ చూస్తుందని ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వివిధ ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రజా ఆరోగ్య సమస్యలపై ఆసక్తితో వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తారని గ్లోబల్ హెల్త్ కౌన్సిల్ వంటి మీడియా నివేదికలలో వారి మద్దతును ప్రముఖంగా ప్రకటిస్తూన్నారని ఎనిమిది అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ప్రపంచ రోగనిరోధక వారోత్సవం, ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ రక్తదాత దినోత్సవం, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంతో పాటు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా చేర్చారు అని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 సంవత్సరం ఒక థీమ్ ప్రకటించింది అని, ప్రజలు, జంతువులు, మొక్కలు మరియు భూగోళం యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి శాస్త్రీయ సహకారం యొక్క శక్తిని చాటిచెప్పే “ ఆరోగ్యం కోసం కలిసికట్టుగా. విజ్ఞానానికి అండగా నిలబడదాం అనే ఇతివృత్తంతో ప్రపంచాన్ని ఏకం చేసిందని తెలిపారు.అనంతరం పెద్దిపాగ అనీల్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటానికి గల ప్రధానమైన విషయాలు ఏమనగా ఆరోగ్యకరమైన మంచి ఆహారం అంటే పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, మరియు పాల ఉత్పత్తులతో సహా కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ పదార్థాలను తినడం,కొవ్వు,చక్కెర మరియు ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తినకపోవడం, సమతుల్యమైన, విభిన్నమైన ఆహారం ఈ రోజులలో చాలా అవసరం అని ఆరోగ్యకరమైన ఆహారం నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి, పిల్లలు రోజుకు 6-8 గ్లాసుల నీరు త్రాగాలి, రోజుకు కనీసం 60 నిమిషాల వ్యాయామం చేయాలి మరియు తగినంత నిద్రపోవాలి, అప్పుడే ఆరోగ్యం గా ఉంటారు అని తెలిపారు. అనంతరం నేలటూరి నాగమణి మాట్లాడుతూ కిశోర బాలికలలో 10-19 సంవత్సరాల వయస్సు ఆడపిల్లలు రక్తహీనత అనేది భారతదేశంలో, ముఖ్యంగా గ్రామీణ మరియు తక్కువ ఆదాయ వర్గాలలో ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉందని ఈ దశలో శారీరక మార్పులు, రుతుస్రావం మరియు పోషకాహార లోపం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోతుందని కిశోర బాలికల లో రక్తహీనత లోపానికి ముఖ్య కారణం ఏమనగా భారతదేశంలో దాదాపు 50-60% పైగా కౌమార బాలికలు ఏదో ఒక రకమైన రక్తహీనతతో బాధపడుతున్నారు, దీనికి ప్రధాన కారణం: ఐరన్ లోపం, అసమతుల్య ఆహారం మరియు రుతుస్రావం వల్ల అధిక రక్త నష్టం జరిగి ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు కాబట్టి ఆడపిల్లలు మంచి ఆహారం తీసుకోవడం అవసరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బాలల పార్లమెంట్ చెందిన పిల్లలు,గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది అత్తోట పోతురాజు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

