NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్లమెంటులో అమరావతి రాజధానిపై చట్టబద్ధతపై హర్షం వ్యక్తం

1 min read

హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసిన ఎస్ఇ,ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ సిబ్బంది

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పార్లమెంట్ లో అమరావతి రాజధాని పై  చట్టబద్దతపై ఆమోదం లభించడంపై జిల్లాలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సంతోషంతో వారి ఇళ్ల వద్ద, అధికారులు కార్యాలయాల వద్ద  అంబరాన్ని అంటేలా సంబరాలు నిర్వహిస్తున్నారు.  ప్రజలు తమ ఇళ్లను, అధికారులు తమ కార్యాలయాలను  విద్యుత్ దీపాలతో అలంకరించుకోవడం, కేకులు కట్ చేసే ఆనంద సంబరాలు చేసుకుంటున్నారు.  పార్లమెంట్ అమరావతి రాజధానిగా చట్టబద్దతకు ఆమోదం తెలియజేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయమంటూ  ప్రజలందరూ  సంతోషంతో బాణాసంచా కాలుస్తూ  ఒక పండుగ వాతావరణంలో  వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా  ఆర్డబ్ల్యూఎస్  ఎస్ఇ,డిఈ,ఏఈ లు మరియు కార్యాలయ సిబ్బంది కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు.

About Author