నంద్యాలలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
1 min read

పుచ్చకాయల మాడ పి హెచ్ సి ఆశా కార్మికుల సమావేశంలో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రవిచంద్ర పిలుపు
న్యూస్ నేడు, పత్తికొండ: ఈనెల 17న ప్రారంభమయ్యే సిఐటియు రాష్ట్ర మహాసభ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిఐటియు పత్తికొండ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర పిలుపునిచ్చారు.పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామం పి హెచ్ సి నందు మంగళవారం ఆశా వర్కర్ల సమావేశం నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు ఆశ కార్మిక సంఘం సమావేశం నిర్వహించి డాక్టర్ రాఘవ నాయుడు డాక్టర్ సుజాత కు వినతి పత్రం అందించారు . ఈ సమావేశానికి ఆశ వర్కర్స్ అండ్ యూనియన్ పత్తికొండ మండల కార్యదర్శి పావని, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు పత్తికొండ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రవిచంద్ర మాట్లాడుతూ, ఈనెల 17, 18, 19 తేదీలలో నంద్యాల జిల్లా నందు సిఐటియు రాష్ట్ర మహాసభలు జరుగుతాయని అన్నారు. ఈ మహాసభలకు ప్రతి ఒక్క కార్మిక సంఘం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందులో భాగంగానే ఆశా కార్మికులు కూడా 17న జరిగే బహిరంగ సభలో హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆశా కార్మికులకు వేతనాలు మరియు పనిభారం ఆరోగ్య బీమా వంటి ప్రధాన డిమాండ్లను ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుందని ఆశా కార్మికులు ఉద్యమాలకు వెనకాడకూడదని సిఐటియు పిలుపుమేరకు వారి హక్కులను సాధించుకునే కొరకు సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రాధ నాగలక్ష్మి ముని లక్ష్మి కె. మల్లమ్మ కె. కేశమ్మ బి. సుధా రాణి ఎం. నీలమ్మ, బి. తాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

