NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అత్యాధునిక వైద్యంలో నారాయణ హెల్త్ సాధించిన గొప్ప మైలురాయి

1 min read

అనంతపురం , న్యూస్​ నేడు : బెంగుళూరు ప్రధాన కార్యాలయంగా డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి గారిచే స్థాపితమైన నారాయణ హెల్త్  ప్రపంచ ఆరోగ్య సంరక్షణా రంగంలో ఒక పేరొందిన వైద్యశాలగా ప్రసిద్దమైనది. అత్యాధునిక వైద్య విధానాలతో 10,000 పైగా ఆర్థోపెడిక్ మరియు వెన్నెముక శస్త్రచికిత్సలను దిగ్విజయంగా నిర్వహించి గొప్ప మైలురాయిని సాధించినది. ఇది నారాయణ హెల్త్  వైద్య సామర్థ్యతలను మరింత బలోపేతం చేసింది. నారాయణ హెల్త్  1,000కు పైగా రోబోటిక్ కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలతోపాటు 10,000  సంక్లిష్టమైన ఆర్థోపెడిక్ మరియు వెన్నెముక చికిత్సలను విజయవంతంగా నిర్వహించిఈ రంగంలో చికిత్సలకు కేంద్ర బిందువుగా మారింది.   నారాయణ హెల్త్ 10,000కు పైగా  ఆర్థోపెడిక్ మరియు వెన్నెముక శస్త్రచికిత్సల మైలురాయిని సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సదస్సులో డాక్టర్ అభినందన్ ఎస్. పునిత్, నారాయణ హెల్త్, సీనియర్ కన్సల్టెంట్, క్లినికల్ లీడ్ – ఆర్థ్రోప్లాస్టీ  మాట్లాడుతూ, ఆధునికమైన నాణ్యత కలిగిన ఆరోగ్యసంరక్షణను అందరికి అందుబాటులోనికి తీసుకురావటం తమ లక్ష్యం అన్నారు. రోబోటిక్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో మరియు నిపుణులైన వైద్యసిబ్బంది సహకారంతో మేము నిర్వహిస్తున్న వైద్యవిధానాలు ఈ మైలురాయి సాధనకు నిదర్శనం అన్నారు. డాక్టర్ శశిధర్ బి కె నాయకత్వంలో వెన్నెముక శస్త్రచికిత్స బృందం, ట్యూమర్ సర్జన్లు డాక్టర్ సుమన్ బైరేగౌడ, డాక్టర్ అంజనా రెడ్డిలతో కలిసి, అత్యాధునిక ఓ-ఆర్మ్ గైడెడ్ న్యూరో నావిగేషన్ మరియు మల్టీమోడల్ అడ్వాన్స్‌డ్ న్యూరోమానిటరింగ్ మార్గదర్శకత్వంలో కణితిని తొలగించి బహుళ-స్థాయి వెన్నెముక స్థిరీకరణతో కూడిన అత్యంత అధునాతన శస్త్రచికిత్సను దిగ్విజయంగా నిర్వహించారు. ఇది శరీరంలోని కీలకమైన భాగాలను స్పష్టంగా చూసేందుకు వీలు కల్పించిన, పరిసర భాగాలకు ఎలాటి నష్టం వాటిల్లకుండా కాపాడుతుంది అన్నారు. ఈ విధమైన శాస్త్ర చికిత్స రోగి త్వరితంగా కోలుకోవటానికి మరియు మెరుగైన ఫలితాల సాధనలో కీలక పాత్రను పోషిస్తుంది అన్నారు.నారాయణ హెల్త్ ఈ మైలురాయి సాధించటంలో ఆర్థోపెడిక్ మరియు వెన్నెముక సంరక్షణలో ముందస్తు రోగ నిర్ధారణ, అత్యాధునిక వైద్య ఆవిష్కరణలు, సమగ్ర సంరక్షణపై నిరంతర దృష్టి సారించటం ద్వారా వైద్య రంగంలో  తన స్థానాన్ని మరింత పటిష్ట పరచుకుంటున్నాది. ఈ మైలురాయి, నారాయణ హెల్త్ తమ వైద్య సంస్థలు అన్నింటిలోను నిరంతరం రోగి సంరక్షణకు ఉత్తమ వైద్య సేవలను అందిస్తూనే, క్లిష్టమైన వెన్నెముక మరియు ఆర్థోపెడిక్ వంటి  సమస్యలకు అధునాతన శస్త్రచికిత్స పరిష్కారాలను అందరికి  అందుబాటులోకి తీసుకురావడానికి కట్టుబడి ఉందని నొక్కి చెబుతోంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *