ఫాదర్ విసెంట్ ఫెర్రర్ 106వ జయంతి
1 min read

సేవలను స్మరించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
యువత సేవా మార్గంలో ముందుకు రావాలని ఎస్. కెంచప్ప పిలుపు
హోళగుంద న్యూస్ నేడు : మానవ సేవకు ప్రతీకగా నిలిచిన ఫాదర్ విసెంట్ ఫెర్రర్ 106వ జయంతి సందర్భంగా ఆయన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎస్. కెంచప్ప మాట్లాడుతూ. పేదల పట్ల అపారమైన సేవాభావంతో తన జీవితాన్ని అంకితం చేసి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు.ఫాదర్ విసెంట్ ఫెర్రర్ స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, వికలాంగుల సంక్షేమం వంటి అనేక రంగాల్లో అందించిన సేవలు అమూల్యమని కొనియాడారు. గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడిగా ఆయనను గుర్తుచేసుకున్నారు.అలాగే, ఫాదర్ విసెంట్ ఫెర్రర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన సేవా మార్గంలో యువత ముందుకు రావాలని ఎస్. కెంచప్ప పిలుపునిచ్చారు. ఇలాంటి మహానుభావుల జయంతులు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, వారి ఆలోచనలు మరియు ఆచరణలను జీవితంలో అమలు చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిబిటి ఆంజనేయులు, ముకమ్మ, నాగప్ప, పతి, శివకుమార్, కెంచప్ప, అంజనప్ప, రంగప్ప, ఈరప్ప, శేషి, వీరేష్, నాగ, పకీరప్ప, శివలింగ, మౌలా తదితరులు పాల్గొన్నారు.

