NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీసీల హక్కులను సాధించేంత వరకు పోరాటం ఆగదు..

1 min read

బిసివై పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్.

ఏప్రిల్ 11న బిసివై అధినేత రామచంద్ర యాదవ్ చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షను విజయవంతం చేద్దాం.బీసీ హక్కులను సాధించుకుందాం…

హోళగుందన్యూస్ నేడు: బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ అన్న గారి ఆదేశాల మేరకు బీసీల 5 డిమాండ్ల 1.బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలి,2.రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000ఎకరాలను కేటాయించాలని,3.సమగ్ర కుల గణన చేపట్టాలని,4.విద్య ఉద్యోగాల్లో,స్థానిక సంస్థ, ఎన్నికల్లో చట్టసభల్లో బీసీలకు 44%శాతం రిజర్వేషన్ ను కల్పించాలని,5.బీసీలకు కార్పోరేషన్ నిధులను విడుదల చేసి బీసీల అభివృద్ధి కోసం పాటు పడాలని డిమాండ్ చేస్తూ  కర్నూలు జిల్లాలో గురువారం రోజు రిలే నిరాహారదీక్షను చేపట్టడం జరిగింది. ఈ ధీక్షలో  టి.శేష ఫణి బిసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బిసివై పార్టీ జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్, రాష్ట్ర ఈసి మెంబర్ కంది వరుణ్ కుమార్ యాదవ్,బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీ నివాసులు, బీసీ సంఘాల నాయకులు అయ్యన్న యాదవ్ బీసీల హక్కులను సాధించే వరకు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని ,సిందు నాగేశ్వరరావు ,బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి నాగార్జున, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎద్దపెంట అంజి,కర్నూలు 17వ వార్డు రవి కుమార్, కల్లూరు మండలం అధ్యక్షుడు అంజి, బీసీ సంఘం నాయకుడు కల్యాణ్ గౌడ్ కుమార్,పందికోన ఈరన్న, మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొని మద్దతు తెలపడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *