పారాక్వాట్ విషాన్ని తాగినా వ్యక్తిని ప్రాణాపాయం నుండి తప్పించిన వైద్యులు
1 min read

– మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు
కర్నూలు, న్యూస్ నేడు: పారాక్వాట్ వంటి ప్రమాదకరమైన విషపదార్థం తీసుకున్న ఒక రోగిని సమయానికి చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి రక్షించిన సంఘటన మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు లో చోటుచేసుకుంది. రాయలసీమ ప్రాంతంలో ఇటువంటి విషానికి అత్యవసర చికిత్స చేయడం మరియు పేషెంట్ కోలుకోవడం ఇదే మొదటిది.శ్రీధర్ అనే రోగి సుమారు 50–70 మిల్లీలీటర్ల(ml) పారాక్వాట్‌ను తీసుకున్న తర్వాత 2 గంటల లోపే ఆసుపత్రికి తరలించబడారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా, వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించారు. ఈ కేసులో భాగంగా మొదటి 24 గంటల్లోనే హీమోపర్ఫ్యూషన్ డయాలిసిస్‌ను 2 సైకిళ్లుగా నిర్వహించారు. అనంతరం రోగి పరిస్థితిని పర్యవేక్షిస్తూ మొత్తం 3–4 cycles డయాలిసిస్ అందించారు. వైద్య బృందం సమిష్టి కృషి, సకాలంలో చికిత్స వల్ల రోగి ఒక నెలలో పూర్తిగా కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి చేరుకున్నారు.ఈ చికిత్సలో జనరల్ ఫిజీషియన్ డా. సరయూ రెడ్డి, నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ కీలక పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ విభాగం మరియు ఐసీయూ బృందం సమన్వయంతో చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వైద్యుల ప్రకారం పారాక్వాట్ విషం అత్యంత ప్రమాదకరమైనదిగా ఉండి, ఆలస్యమైతే ప్రాణాపాయం తప్పదని తెలిపారు. ఇటువంటి సందర్భాల్లో వెంటనే ఆసుపత్రికి చేరుకోవడం, అత్యవసర వైద్య సేవలు అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ Maheswar Reddy మాట్లాడుతూ, “పారాక్వాట్ వంటి విషపదార్థాలు తీసుకున్నప్పుడు మొదటి కొన్ని గంటలు అత్యంత కీలకం. సమయానికి ఆసుపత్రికి తీసుకురావడం వల్లే రోగి ప్రాణాలను కాపాడగలిగాం. మా వైద్య బృందం అనుభవం, అత్యాధునిక చికిత్సా విధానాలు, ఎమర్జెన్సీ & ఐసీయూ సమన్వయం వల్ల ఈ క్లిష్టమైన కేసును విజయవంతంగా నిర్వహించగలిగాం. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం” అని తెలిపారు.

