పోషణ పక్వాడ కార్యక్రమాలు ప్రారంభం..
1 min read

పౌష్టికాహారం, టీకాల గురించి వివరిస్తున్న డాక్టర్ ప్రత్యూష
చాగలమర్రి న్యూస్ నేడు: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమాలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో గురువారం ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రత్యూష , ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సుశీల ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రవేట్ మేటర్నిటీ ఆస్పత్రిలో కూడా పోషణ పక్వాడ కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ , సిడిపిఓ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ చిన్నపిల్లలకు మొబైల్ దూరంగా ఉంచాలన్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుండి ఆహారం తెచ్చి పిల్లలకు ఇవ్వరాదని, ఇంటిలో సహజంగా చేసిన ఆహారాన్ని మాత్రమే ఇవాళ అన్నారు. చిప్స్, కురుకురే వంటి జంక్ ఫుడ్స్ కు బదులుగా శనగలు, పప్పులు, పల్లీలు, చిరుధాన్యాలతో తయారైన పాప్ కార్న్స్, పండ్లు ఆరోగ్యకరమైన స్నాక్స్ ను వినియోగించాలని సూచించారు. పౌష్టికాహారంతో పాటు సరైన సమయానికి టీకాలను వైద్య సిబ్బంది చే వేయించాలని సూచించారు. అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీల మాట్లాడుతూ పౌష్టికాహార తయారీ పోటీలను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించాలని తెలిపారు. చిన్నపిల్లల మానసిక, శారీరక పరిపక్వత కోసం బొమ్మల తయారీ తదితర పోటీలను నిర్వహించాలన్నారు. హానికరా అలవాట్లు మార్చుకోవాలని ఆమె సూచించారు. చక్కెరకు దూరంగా ఉంచాలని జ్ఞాపక శక్తి ఆలోచన వికాసం చిన్నపిల్లలకు దెబ్బతింటాయన్నారు. చిన్నపిల్లలకు మొబైల్ ఇవ్వడం ద్వారా కంటి చూపు, మెదడు అభివృద్ధిపై చెడు ప్రభావం చూపుతుందన్నారు. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఇవ్వాలన్నారు. దీంతో రోగ నిరోధక శక్తి పెరిగి మెదడు అభివృద్ధి చెందుతుందన్నారు. చిన్నపిల్లలను ఇంట్లో బయట ఆడుకునేందుకు వీలు కల్పించాలన్నారు. శారీరక నైపుణ్యాలు మెరుగవుతాయని తెలిపారు. ఎక్కువ సమయం చిన్న పిల్లలతో గడపాలని ఇందువల్ల వారి అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ విజయభారతి, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడి కేంద్రాల పరిధిలోని గర్భవతులు, కిషోర బాలికలు, తదితరులు పాల్గొన్నారు.

