అరికేర గురుకుల పాఠశాలలో వైకుంఠం జ్యోతి ఆకస్మిక తనిఖీ
1 min read

– విద్యార్థులతో కలిసి భోజనం
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి నేడు ఆలూరు మండలంలోని అరికేర డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా, వసతి, ఆహార సదుపాయాలపై స్వయంగా పరిశీలన నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించి, విద్యార్థుల హాస్టల్ గదులు, మరుగుదొడ్లు మరియు ఇతర వసతులపై అధికారులకు తగు సూచనలు చేశారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేలా పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.అలాగే వంటశాలను స్వయంగా తనిఖీ చేసి, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతున్నదా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. భోజన నాణ్యత, ఆహార పదార్థాల ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు.సందర్శనలో భాగంగా ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, వారి చదువు, వసతులు, సమస్యల గురించి ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వారికి మరింత మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలు నాణ్యంగా, సక్రమంగా అందాలని, ముఖ్యంగా పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల విద్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.


