NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీటి భద్రత-సాగనీటి సంఘాల బాధ్యత కార్యక్రమం

1 min read

జిల్లాలో చేపట్టవలసిన మరమ్మత్తులు,పూడికతీత, కాలువలు,చెరువుల తదితర వివరాలు వెంటనే సమర్పించాలి

జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టవలసిన  మరమ్మత్తులు,పూడికతీత, తదితర పనులు కాల్వలు, చెరువుల వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం  ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంపై ఇరిగేషన్ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నీటి పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంతో ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.   వర్షాకాలం సీజన్ ప్రారంభం నాటికి నీటి వనరులన్నింటినీ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యంతో సిద్ధం చేయాలన్నారు. అందుకు అవసరమైన సమాచారాన్ని అందించాలని, జిల్లాలో   నీటి వనరులు ఎన్ని ఉన్నాయి , వాటిని పూర్తి నీటి నిల్వ సామర్ధ్యంతో  నీటిని నింపేందుకు తీసుకోవలసిన చర్యలపై  గ్రామాల వారీగా నివేదిక అందించాలన్నారు.   నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపుడెక్క,తూడు తొలగింపు, పూడికతీత, ఆక్రమణల తొలగింపు, చెరువు, కాలవల గట్లు పటిష్టం, తదితర పనులకు అవసరమైన నిధుల వివరాలతో ప్రాధమిక  ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ప్రతిపాదనలు రూపొందించడంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సూచనలు పరిగణనలోనికి తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇర్రిగేషన్ శాఖ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆర్. సతీష్ కుమార్, ఇరిగేషన్ శాఖ ఏలూరు ఎస్ఈ దేవప్రకాష్, భూగర్భ జల శాఖాధికారి కోదండరావు, ఇరిగేషన్ శాఖ  డీఈ లు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *