NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నెలలు నిండని శిశువుకి… కిమ్స్ సవీరలో విజయవంతంగా చికిత్స

1 min read

26 రోజుల పాటు అనంత మిల్క్ బ్యాంక్ సహాకారం

ఎన్ఐసియు బృందం కీలక పాత్ర

అనంతపురం, న్యూస్​ నేడు:  నెలలు నిండక ముందే జన్మించిన శిశువునుకాపాడి విజయంతంగా డిశ్చార్జ్ చేశారు కిమ్స్ సవీర వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను చికిత్సనందించిన కన్సల్టెంట్ పీడియాట్రిక్స్ & నియోనాటాలజిస్ట్ డాక్టర్ మౌనిక రెడ్డి తెలిపారు.అనంతపురం జిల్లాకు చెందిన ఓ గర్భిణీకి తీవ్రంగా బిపి పెరగడంతో స్థానిక హాస్పిటల్ కు తీసుకవెళ్లారు. అక్కడ నుండి మొరుగైన చికిత్స కోసం కిమ్స్ సవీర ఆస్పత్రికి తీసుకవచ్చారు. ఇక్కడకు వచ్చిన సమయంలో గర్భిణీకి పూర్తిగా నెలల నిండలేదు. ఏడవ నెల చివరి దశలో ఉంది. అంటే శిశువు ప్రసవానికి సిద్దంగా లేరు. కానీ గర్భిణీకి వచ్చిన ఆరోగ్య సమస్యలతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రసవం చేయాల్సి వచ్చింది. 7 నెలలకే జన్మించిన పసికందు కేవలం 900 గ్రాముల బరువు మాత్రమే ఉంది. నెలలు నిండకుండా పుట్టడం మరియు బరువు అత్యల్పంగా ఉండటంతో చిన్నారిని వెంటనే నియోనేటల్ ఐసీయూ (ఎన్ఐసియు) విభాగంలో ఉంచి చికిత్స ప్రారంభించారు.వైద్య పరిజ్ఞానం ఎంత పెరిగినా, ప్రకృతి ప్రసాదించిన తల్లి పాలకు సాటి ఏదీ లేదని అనంతపురంలోని కిమ్స్ సవీరా  ఆసుపత్రి వైద్యులు మరోసారి స్పష్టం చేశారు.  ఈ చికిత్సలో డా. ఏ. మహేష్, డా. మనోహర్ గాంధీ, డా. మౌనిక రెడ్డి డా. శ్వేత కీలక పాత్ర వహించారు. అనంత మిల్క్ బ్యాంక్ నిర్వహకులకు మరియు  ఆర్ఎంఓ డా. హేమలతకు కిమ్స్ వైద్య బృందం ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. తల్లి పాలు లేని ఎందరో చిన్నారులకు ప్రాణదానం చేస్తున్న ఇటువంటి సంస్థలకు అండగా నిలవాలని, అర్హులైన తల్లులు పాలను దానం చేయడానికి ముందుకు రావాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *