NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమతుల్య ఎరువుల వాడకం మంచిది.. మండల వ్యవసాయ శాఖ అధికారి..

1 min read

రైతులకు సూచనలు ఇస్తున్న మండల ఏవో రంగా నేతాజీ

చాగలమర్రి రూరల్ న్యూస్​ నేడు: అధిక రసాయనిక ఎరువుల కంటే సమతుల్య ఎరువుల వాడకం మంచిదని మండల వ్యవసాయ శాఖ అధికారి రంగ నేతాజీ అన్నారు. శుక్రవారం ముత్యాలపాడు గ్రామంలో’ ధర్తీ మాత బచావో’ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అధిక రసాయనిక ఎరువుల వాడకం వలన కలిగే నష్టాల గురించి రైతులకు తెలియజేశారు. ఖరీఫ్ సీజన్ లో వాతావరణ పరిస్థితులు మార్పు చెందే అవకాశం ఉందన్నారు. సాధారణ కంటే అధిక వేడి, కరువు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఋతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. సాగునీటి కొరత ఏర్పడి సాగునీటి లభ్యత తక్కువగా అందుతుందన్నారు. వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పై ఆధారపడకుండా పీఎం డిఎస్ పద్ధతిలో విత్తనాలను గుళికలుగా చేసి తొలకరి వర్షాలు రాకముందే విత్తనాలు చల్లుకోవడం వలన తక్కువ వర్షంతో కూడా మంచి దిగుబడి సాధించవచ్చు అన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా   ఘనజీవామృతం, ద్రవ జీవామృతం ద్వారా నాణ్యమైన దిగుబడి సాధించవచ్చన్నారు. రాబోవు ఎల్ నినో వర్ష భావ పరిస్థితులకు అనుగుణంగా  రైతులు తమ పంట సరళిని మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, జయరాం రెడ్డి, నరేష్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *