NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరులో ఘనంగా 8వ పోషణ పక్వాడా కార్యక్రమం

1 min read

– ముఖ్య అతిథిగా వైకుంఠం జ్యోతి పాల్గొనడం

గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించిన వైకుంఠం జ్యోతి

“ఆరోగ్యమే మహాభాగ్యం – పోషకాహారమే దానికి మార్గం” అంటూ పౌష్టికాహార ప్రాముఖ్యత వివరింపు

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు పట్టణంలో 8వ పోషణ పక్వాడా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్  వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతి కుటుంబం పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అలాగే, “ఆరోగ్యమే మహాభాగ్యం – పోషకాహారమే దానికి మార్గం” అనే సందేశంతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు సమతుల ఆహారం, పాలు, పండ్లు, ఆకుకూరలు వంటి పౌష్టికాహార పదార్థాల అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *