నందికొట్కూర్ పట్టణ సీఐగా అశోక్ కుమార్
1 min read

సోషల్ మీడియాకు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ సీఐగా ఎన్ అశోక్ కుమార్ ను నియమిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇక్కడున్న సీఐ వై ప్రవీణ్ కుమార్ రెడ్డి కర్నూలు సోషల్ మీడియా మరియు సైబర్ క్రైమ్ సెల్ గా బదిలీ చేశారు.సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి 2014 సెప్టెంబర్ లో నందికొట్కూరు సిఐగా బాధ్యతలు చేపట్టి పట్టణంలో నేర నియంత్రణ,గంజాయి శాంతి భద్రతల పరిరక్షణలో రూపుమాపేందుకు సీఐ కృషి చేశారు.కర్నూలు రేంజ్ పరిధిలో ఉన్న 25 మంది సీఐ లను డిఐజి బదిలీ చేశారు. ఈ సందర్భంగా నందికొట్కూరు పట్టణ నూతన సీఐగా రానున్న అశోక్ కుమార్ మాట్లాడుతూ 2004 ఎస్సై బ్యాచ్ కి ఎంపిక అయ్యానని ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాలహర్వి,సిసిఎస్ మరియు కర్నూల్ రైల్వే తదితర పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించినట్లు నాలుగు ఐదు రోజుల్లో నందికొట్కూరు పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సోమవారం సాయంత్రం నూతన సీఐ తెలిపారు.

